తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం, గోవర్ధనపురం నందు మంగళవారం రోజు మ్యాజిక్‌బస్ ఇండియా ఫౌండేషన్ అద్వర్యంలో మాండెలెజ్ సహకారంతో జిల్లా పరిషత్ పాఠశాలలో స్పోర్ట్స్ ఫెడరేషన్ మీట్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ బాక్స్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిల్లలకు అందిస్తున్న ఫిజికల్ ఎక్సైజ్, ఆటలు పోటీల్లో విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలని తనవంతు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా ఫౌండేషన్ క్లస్టర్ మేనేజర్ ఆనంద్, కోఆర్డినేటర్ సుమంత్ వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ఉపాధ్యాయులు రవీంద్రారెడ్డి, మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ముద్దుకృష్ణ, జిల్లా ఫిజికల్ సంఘం ఉపాధ్యక్షులు బి.కుమార్, సురేంద్ర, ఎంఈఓ గున్నయ్య, మ్యాజిక్‌బస్ క్లస్టర్ మేనేజర్ పి. ఆనంద్, మ్యాజిక్‌బస్ కార్యక్రమం కో ఆర్డినేటర్ డి. సుమంత్, కోచ్‌లు మురళీ కృష్ణ, శ్రీకాంత్, సందీప్, లత, హరికృష్ణ, సతీష్, కిరణ్, రాంబాబు, గోల్‌కీపర్లు మరియు 26 పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్పోర్ట్స్ ఫెడరేషన్ మీట్
RELATED ARTICLES