ఘనంగా రాష్ట్ర స్థాయి టెలి లా వర్క్ షాప్ మరియు మేళా
ఉత్తమ వి ఎల్ ఈ గా అవార్డు అందుకున్న సి ఎస్ సి వరదయ్యపాలెం మండల కోఆర్డినేటర్ ఎలియాజర్ పల్లిపట్టు
విజయవాడలో 05-03-2024 వ తేదీన మరీస్ స్టెల్లా ఆడిటోరియం నందు స్టేట్ లెవెల్ టెలి లా వర్కుషాప్ మరియు మేళా నిర్వహించారు. ఇందులో భాగంగా సి ఎస్ సి స్టేట్ హెడ్ రవి కుమార్ మాట్లాడుతూ 2010 లో 5000 సెంటర్లతో మొదలుపెట్టి ఇప్పుడు 25000సెంటర్లతో సర్వీసులు అందిస్తున్నట్లు తెలిపారు. పి ఎం జి దిశా ప్రాజెక్ట్ ద్వారా దేశమంతటా 50లక్షల ప్రజలకు ఇప్పటి వరకు డిజిటల్ లీటరసీ అందించామని హర్షం వ్యక్తం చేసారు.ఐ జి ఆర్ ఎస్ కమీషనర్ రామ కృష్ణ మాట్లాడుతూ ఈ స్టాంప్ సర్వీస్ను సి ఎస్ సి సెంటర్ల ద్వారా కొనసాగించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సెంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్ సర్వీస్ లు, మ్యారేజ్ సర్టిఫికెట్ లకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నారు.భవిష్యత్తులో ఈ స్టాంప్ లను తొలగించి ఇంకా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా చేస్తున్నాము అన్నారు. ఇందు వలన ఈ స్టాంప్ పేపర్ కోల్పోయినప్పటికి వినియోగదారునికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఉంటుందన్నారు.కమిషనర్ ఈస్తాంప్ పోస్టర్ ను విడుదల చేసారు.ఈ కార్యక్రమం నందు సెక్రటరీ అఫ్ లా సత్యం ప్రభాకర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ నందు రెండు లక్షల వరకు కేసులు రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిపారు.దాదాపుగా 20 మంది ప్యానెల్ లాయర్ల ద్వారా ఉచితంగా సలహా అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.సి ఎస్ సి సెంటర్లలో సెక్షన్ 12 ప్రకారం ప్రజలు ఉచితంగా సలహాలు పొందవచ్చని అన్నారు.ప్రస్తుత విద్యార్థులు కూడా లా కోర్స్ చేయడం చాలా సులభతరం మరియు లా కోర్స్ చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడే వారికి కూడా ప్రభుత్వం నుండి వివిధ పథకాల ద్వారా ఆర్ధిక సహాయం అందుతుంది అన్నారు. ఈ సేవలను అందిస్తున్న ప్యానెల్ లాయర్లను అభినందించారు.20 మంది ప్యానెల్ లాయర్లతో పోస్టర్ విడుదల చేసారు.అదేవిధంగా సి ఎస్ సి మీసేవ స్పెషల్ సెక్రటరీ సుందర్ మాట్లాడుతూ 2015 లో మీసేవలు సి ఎస్ సి నందు అందుబాటులోకి వచ్చాయి అన్నారు.ఈ కార్యక్రమం లో ఒకప్పటి గ్రామీణ ఇస్టోర్ సి ఓ ఓ రాజకిషోర్ పాల్గొనడం ఆకర్షనీయం.ప్యానెల్ లాయర్లు ఇరిగి రాజీవ్, కవిటి నరేష్, ఆనంద్ లు ఉత్తమ లాయర్లు గా అవార్డు అందుకున్నారు.ఉమ్మడి తిరుపతి, చిత్తూరు జిల్లాల నుండి టెలి లా సర్వీస్ నందు అత్యధిక కేసులు రిజిస్టర్ చేసిన వరదయ్య పాలెం మండల కోఆర్డినేటర్ ఎలియాజర్ పల్లిపట్టు, ఓగురు అనిల్ ను ఉత్తమ వి ఎల్ ఈ లుగా ప్రశంసలు అందుకొని టెలి లా స్టేట్ ఇంచార్జి వినయ్, స్టేట్ హెడ్ రవికుమార్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.ఈ కార్యక్రమం నందు టెలి స్టేట్ ఇంచార్జి వినయ్,గ్రామీణ ఈ స్టోర్ సైదావలి, ప్యానెల్ లాయర్లు హిమశ్రీ, షైక్ అబ్దుల్, ఇరిగి రాజీవ్, కవిటి నరేష్, ఆనంద్ కుమార్,మానస, ఉమ్మడి జిల్లాల వి ఎల్ ఈలు మొహమ్మద్ రఫీ, ఓగురు అనిల్, పసుపుల లవకుమార్, ఉదయ్ కిరణ్, ఆదిత్య, రాజాజీ,గురు రాఘవేంద్ర, అదెప్ప,ప్రకాష్,కృష్ణవేణి, హరికృష్ణలు పాల్గొన్నారు
ఘనంగా రాష్ట్ర స్థాయి టెలి లా వర్క్ షాప్ మరియు మేళా
RELATED ARTICLES