భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం
చండ్రుగొండ మండల కేంద్రంలోని రైతు వేదిక లో గ్రంథాలయ సాధన సన్నాహక కమిటీ సమావేశం రాయి రాజా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు, గ్రామ యువత, అఖిలపక్ష రాజకీయ నాయకులు తదితరులు పాల్గొని వారి వారి అభిప్రాయాలు తెలియపరచడం జరిగింది.. చంద్రుగొండ మండల ప్రధాన కేంద్రం అవడం వలన నిత్యం ప్రజలు వస్తువులు కొనుగోలు అమ్మకాల కోసం బ్యాంకులకు, ఇతర లావాదేవీలకు వచ్చినప్పుడు మహిళలకు మూత్రశాలలు లేకఅనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని అఖిలపక్ష నాయకులు సమావేశంలో అభిప్రాయపడ్డారు.. ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రంథాలయం, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని వారు అన్నారు.. కాంగ్రెస్, సిపిఎం, టిఆర్ఎస్, బిజెపి ప్రజా సంఘాల, మండల నాయకులు పాల్గొనడం జరిగింది.
గ్రంథాలయ సాధన సన్నాహక కమిటీ సమావేశం
RELATED ARTICLES