రిపోర్టర్ పి. శ్రీధర్
సెంటర్: ఆళ్లగడ్డ
TEJA NEWS TV : ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ అధికారిగా పనిచేసి నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీగా బదిలీ అయిన వెంకటరామయ్యను శుక్రవారం రాత్రి పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. స్థానిక డిఎస్పీ కార్యాలయా ఆవరణలో జరిగిన సన్మాన సభకు సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐ లు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని డీఎస్పీ వెంకటరామయ్య అందించిన సేవలను కొనియాడారు. ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్లో ఎస్సైగా, సీఐగా, డీఎస్పీగా మూడు స్థాయిలలో పని చేసి విశేష సేవలు అందించిన డిఎస్పి వెంకట్రామయ్య కు పోలీసు శాఖ సిబ్బంది ఘన సన్మానం నిర్వహించి బదిలీ వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా సన్మాన గ్రహీత డిఎస్పి వెంకటరామయ్య మాట్లాడుతూ 1989 బ్యాచ్ ఎస్ఐగా తాను సెలెక్ట్ అయిన తర్వాత ఆళ్లగడ్డ ప్రాంతంలో ఎస్ఐ గా పని చేసే సమయంలో పూర్తిగా ముఠాకక్షలతో ఉండేదని… ప్రతినిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేదన్నారు. ఆరోజు ఆళ్లగడ్డలో ఉన్న పరిస్థితులకు ఈరోజు ఆళ్లగడ్డ పరిస్థితులకు ఎంతో తేడా ఉందన్నారు.తన తండ్రి తనకు నేర్పిన ఆశయాలు , ఇచ్చిన స్ఫూర్తితో తాను ఎక్కడ పనిచేసినా ఎలాంటి అవాంతరాలు లేకుండా కుటుంబం యొక్క సహకారంతో కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం జరిగిందన్నారు. తాను పనిచేసిన అన్ని స్టేషన్లలో సమస్యలు సవాళ్లను అధిగమించి వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసి మంచి పేరు తెచ్చుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. పోలీసు శాఖ అధికారులు, సిబ్బందికి కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసు శాఖలో పనిచేసే అధికారులు సిబ్బంది అందరు ఒక వైపు వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే .. మరోవైపు కుటుంబం, పిల్లల పెంపకం విషయంలో కూడా శ్రద్ధ చూపాలని డీఎస్పీ వెంకటరామయ్య సూచించారు. ఇంట్లో గృహిణి సహాయ సహకారాలు లేనిదే మన ఉద్యోగ బాధ్యతలు కూడా సాఫీగా నిర్వహించలేమన్నారు. పిల్లల చదువుల విషయంలో కూడా ప్రతి తండ్రి బాధ్యత తీసుకోవాలన్నారు. తన పిల్లలను ఇంటర్మీడియట్ విద్య వరకు మాత్రమే తాను డబ్బు పెట్టి చదివించడం జరిగిందని, ఆ తర్వాత వారే తమ ప్రతిభతో మంచి మంచి కళాశాలల్లో ఉచితంగానే సీట్లు తెచ్చుకొని ఈరోజు మంచి స్థాయిలో నిలిచారని ఆయన తెలిపారు.
ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్లో పనిచేసిన సమయంలో తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన అధికారులు, సిబ్బందికి డీఎస్పీ వెంకటరామయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్లోని మీడియా మిత్రుల సహకారం కూడా మరువలేనిద న్నారు. ఈ సందర్భంగా మీడియా బృందానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ జర్నలిస్టు కేపీవి సుబ్బారావు మాట్లాడుతూ నిజాయితీకి నిలువుటద్దంగా పనిచేసి ఆళ్లగడ్డలో శాంతిభద్రతల సంరక్షణలో కీలక పాత్ర పోషించిన డీఎస్పీ వెంకటరామయ్య కు, ఆయన కుటుంబ సభ్యులకు అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రూరల్ సీఐ హనుమంత నాయక్ మాట్లాడుతూ డీఎస్పీ వెంకటరామయ్య సార్ వద్ద గత 9 నెలలుగా పనిచేస్తూ ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగిందన్నారు. ఆయన వద్ద పనిచేసే అదృష్ట భాగ్యం తనకు కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిఎస్పి రఘువీర్, ఆళ్లగడ్డ టౌన్ సిఐ రమేష్ బాబు సిరివెళ్ల సిఐ వంశీధర్, కోయిలకుంట్ల సీఐ జయచంద్ర, కొలిమిగుండ్ల సీఐ గోపి, ఎస్ఐలు వెంకటరెడ్డి, నరసింహులు, నగీన, నిరంజన్ రెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఆళ్లగడ్డ: బదిలీపై వెళ్లిన డిఎస్పి వెంకట రామయ్యకు ఘన సత్కారం…
RELATED ARTICLES