సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే లక్ష్యంతో పనులను పరిశీలించడం జరిగింది
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేట్, సంగెం మండలం చింతలపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను శనివారం రోజు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సందర్శించారు. యూనిట్ల వారిగా అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును అధికారులు పరిశ్రమల నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆర్పాటంగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణానికి భూమి పూజ చేసి ఏడేళ్లు గడిచిన పనులు మాత్రం నత్తనడకగా సాగాయని గత పాలకులు అక్రమ సంపాదనపై ఉన్న శ్రద్ధ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం వల్ల ఎం ఓ యు చేసుకున్న కంపెనీలు సైతం పనులు పూర్తి చేయలేకపోయాయని అన్నారు.
ఎం ఓ యు చేసుకున్న కంపెనీలు తమ యూనిట్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలని, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నట్లు వారు నా దృష్టికి తీసుకుని వచ్చారని ఉద్యోగ భద్రతతో పాటు తగిన వసతులు ఏర్పాటు చేయాలని వారి పని చేస్తున్న కార్మికులకు ఒత్తిడిని తగ్గించెలా యజమాన్యం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే లక్ష్యంతో పనులను జరుగుతున్న తీరును అధికారులు పరిశ్రమల నిర్వాహకులతో కలిసి పరిశీలించడం జరిగిందని అన్నారు.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
RELATED ARTICLES