నాలుగున్నరేళ్లు పూర్తవుతున్నా ఒక్క రోడ్డు వేయలేని జగన్ ప్రభుత్వం
మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి..
మహిళల భద్రత కోసమే మిని మేనిఫెస్టో ఉన్నం వరలక్ష్మి గారు..
శెట్టూరు తేజ టీవీ న్యూస్
మండల పరిధిలోని ములకలేడు, గోవింద్ నగర్, రంగయ్యపాల్యం* గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా *మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు, కోడలు ఉన్నం వరలక్ష్మి,* టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం ఉన్నం వరలక్ష్మి గారు ప్రతి ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో రోడ్లు వేయడం జరిగిందని నేడు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తయినా కూడా ఒక్క గ్రామానికి కూడా రోడ్డు వేయలేకపోవడం సిగ్గు చేటని *టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి* విమర్శించారు. మహిళల భద్రత, మాహిళల అభ్యున్నతి కోసమే మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి పేరుతో మిని మానిఫెస్టోను పెట్టారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి మహిళలకు భద్రత చేకూరుస్తామని అందుకోసం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేయ్యాలని *ఉన్నం వరలక్ష్మి పేర్కొన్నారు….*
ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఆర్.జి శివశంకర్, మాజీ జడ్పిటిసి కవిత, మాజీ ఎంపీపీ శాంతిరమ్మ, మాజీ మండల కన్వీనర్ గురు ప్రసాద్, మాజీ మండల కన్వీనర్ తిప్పారెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి రంగప్ప, లింగారెడ్డి, నరసింహులు, మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…..
కళ్యాణదుర్గం: మహిళల భద్రత కోసమే మిని మేనిఫెస్టో- ఉన్నం వరలక్ష్మి
RELATED ARTICLES