తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (IFTU) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్దగల శివాజీ బీడీ కంపెనీ ముందు 400 మంది బీడీ కార్మికులతో ధర్నా నిర్వహించడం జరిగినది.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం.వెంకన్న మాట్లాడుతూ…
గత కొన్ని నెలలుగా శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం నాసిరకం తునికాకు, తంబాకు కార్మికులకు ఇస్తూ, నెలకు కేవలం 09రోజులు మాత్రమే పని కల్పిస్తుందని ఆరోపించారు. అవసరం మేరకు నాణ్యమైన
తునికాకు, తంబాకు అందివ్వాలని పని దినాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆందోళనకు దిగివచ్చిన కంపెనీ మేనేజర్ వచ్చే నెలనుండి పనిదినాలు పెంచుతామని, మంచి తునికాకు, తంబాకు ఇస్తామని, వేజ్ స్లిప్పులు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ ధర్నా కార్యక్రమంలో IFTU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముత్తెన్న, ఎం.సుధాకర్, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి.మల్లేష్, జిల్లా సహాయ కార్యదర్శి డి.కిషన్ యూనియన్ జిల్లా బిబిపేట్ మండల్ నుంచి తరలి వెళ్లారునాయకులు డి.సాయరెడ్డి, బి.మురళి, నాయకులు లలిత చిన్నమల్లవ్వ, భారతి, జమున, బుచ్చమ్మ, వినోద, రాణి తదితరులు పాల్గొన్నారు.
శివాజీ బీడీ కంపెనీ ముందు బీడీ కార్మికుల ధర్నా
RELATED ARTICLES