బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు.
-స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్.
-ఘనంగా జయంతి వేడుకలు.
-నేతాజి ఆశయ సాధన కోసం పయనిద్దాం.
ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గడగడలాడించిన స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని స్థానిక డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, టి అరుణ, ఎన్ఎస్ఎస్,పిఓ, నరేష్ నాయుడులు అన్నారు. మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ని పురస్కరించుకొని, స్థానిక ఋషి సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలత సుభాష్ చిత్రపటానికి పిఓ ప్రిన్సిపాల్ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతాజీ ఆశయ సాధన కోసం యూత్ అడవి జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. తద్వారా ఆదిశిగా యువత పయనించినప్పుడే నేతాజీకి నిజమైన నివాళులర్పించిన వారు అవుతామన్నారు. స్వతంత్ర సంగ్రామం గ్రామంలో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి సుభాష్ అజాద్ హిందూ పాజి పేరిట ఏకంగా సైన్యాన్ని ఏర్పాటు చేసి కదం తొక్కిన నేతాజీ అని వివరించారు. ఆయన గురించి అప్పుడు విన్నా గుండె ఉప్పొంగిపోతుందన్నారు. వాస్తవంగా సుభాష్ చంద్రబోస్ వామపక్ష వాదిని తెలిపారు.
స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
RELATED ARTICLES



