మాజీ శాసనసభ్యుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి..!*
మహిళలు ఎదిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఉన్నం వరలక్ష్మి.
కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండల పరిధిలోని ఎరిడికెర గ్రామం నందు గొల్లలదొడ్డి* లో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ* పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు, కోడలు ఉన్నం వరలక్ష్మి, చీరలు పసుపు కుంకుమ* పంచుతూ టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం ఉన్నం వరలక్ష్మి గారు ప్రతి ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఈ చేతకాని వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని అక్రమాస్తులు కూడబెట్టేందుకు పనిచేసిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి* విమర్శించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే రాష్ట్రం కూడా అభివృద్ధి పథంలో పయనిస్తుందని, అందుకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల అభ్యున్నతి కోసమే ఎన్నికల మీనిఫెస్టోలో మహాశక్తి పేరిట సూపర్ సిక్స్ పథకాలను తీసుకువచ్చారని ఉన్నం వరలక్ష్మి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ నాగిరెడ్డిపల్లి వెంకటేశులు, మాజీ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, మాజీ కన్వీనర్ విరుపాక్షి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చిత్తప్ప, మాజీ బిటిపి ప్రాజెక్ట్ చైర్మన్ సుభాన్, మాజీ మార్కెట్ డైరెక్టర్ డైరెక్టర్ నాగిరెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ డైరెక్టర్ బసవేశ్వర గౌడ్, మాజీ సర్పంచ్ ముంతాజ్, మాజీ ఎంపిటిసి లింగప్ప, ఎరడికేరా నరసప్ప, నరసింహులు, విరుపాక్షి, శివలింగ, కమ్మరి మంజునాథ్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు…..
గ్రామాల అభివృద్ధిని పట్టించుకోని జగన్ ప్రభుత్వం
RELATED ARTICLES



