TEJA NEWS TV:
*80 హోళగుంద రూ.3 వేలకు పెంచిన పెన్షన్లు పంపిణీ*
*రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి*
జీవితంలో ఎన్నో కష్టాలు చూసి అలసిపోయిన బతుకులకు సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పెన్షన్ కానుకతో భరోసా కల్పించారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి గారు అన్నారు.హోళగుంద మండలం లోని 80 కొత్త మంజూరు అయిన రూ.3వేలకు పెంచిన పెన్షన్లను గుమ్మనూరు నారాయణ స్వామి గారు పంపిణీ చేశారు. లబ్దిదారులకు పెంచిన పెన్షన్లను స్వయంగా అందజేశారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ గారు.. పెన్షన్ ను రూ.3 వేలకు పెంచారన్నారు.పెరిగిన పెన్షన్ల వల్ల అవ్వాతాతలకు మంచి జరుగుతుందన్నారు.పెన్షన్ పెంపుతో లబ్దిదారుల కళ్లలో ఆనందం కనిపిస్తోందన్నారు. రాష్ట్రాన్ని సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నానన్నారు.ఆలూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగున్నరేళ్లలో అభివృద్ధి చేశామన్నారు.మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారన్న నమ్మకం తనకుందన్నారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, వివిధ హోదాలో ఉన్న అధికారులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు
హొళగుంద: అలసిన బతుకులకు భరోసా వైఎస్ఆర్ పెన్షన్ కానుక – గుమ్మనూరు నారాయణ స్వామి
RELATED ARTICLES