ఒక తమిళ కూలి అరెస్ట్
మరో ఏడు మంది దుండగులు పరార్
సిద్దవటం అటవీ క్షేత్ర అధికారి కళావతి
సిద్ధవటం న్యూస్
తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
సిద్దవటం అటవీ శాఖ రేంజ్ లోని సిద్దవటం టౌన్ బీటు ఎద్దుల కొండాలు ప్రదేశంలో 35 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు సిద్దవటం అటవీ క్షేత్ర అధికారి కళావతి తెలిపారు. మ సిద్దవటం అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫారెస్ట్ రేంజర్ కళావతిమాట్లాడుతూ లంకమల అభయారణ్యంలోని సిద్దవటం టౌన్ బీటులో సోమవారం అటవీశాఖ సిబ్బందితో కలిసి కూబింగ్ నిర్వహించామన్నారు. కూంబింగ్ లో భాగంగా శబ్దాలు అవుతుండడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని దాడుల్లో 35 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నామన్నారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ.2లక్షల 35 వేలు ఉంటుందన్నారు. అలాగే దాడుల్లో తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాకు చెందిన పెరుమాల్ సుబ్రమణి ని అదుపులోకి తీసుకున్నామని మరో 7 గురు కూలీలు పరారయ్యారన్నారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నామని పట్టుబడిన నిందితుడిని తిరుపతి కోర్టుకు తరలించామన్నామన్నారు. ఎర్రచందనం అక్రమాలకు పాల్పడినా, సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు చెపడుతామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ ఓబులేసు, ఫారెస్ట్ బీటు అధికారి పెంచల్ రెడ్డి, అసిస్టెంట్ బీటు అధికారులు హైమావతి, నారాయణ రెడ్డి, బేస్ క్యాంపు, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
సిద్ధవటం: లంకమల అభయారణ్యంలో కూంబింగ్ 35 ఎర్రచందనం దుంగలు పట్టివేత
RELATED ARTICLES