బేతంచర్ల మండల పరిధిలోని ఆర్.ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం దర్శనం కల్పించారు. అనంతరం మద్దిలేటి నరసింహస్వామి, లక్ష్మీదేవి, భూదేవిలకు అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని ఆలయ ఈ.వో పాండురంగారెడ్డి, ఆలయ చైర్మన్ సీతారామ చంద్రుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, బేతంచర్ల మండల తహసిల్దార్ నరేంద్రనాథరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.
అంగరంగ వైభవంగా మద్దిలేటి స్వామి కళ్యాణ మహోత్సవం
RELATED ARTICLES