TEJA NEWS TV :
ఈరోజు శ్రీకాళహస్తి జిల్లా స్థాయిలో జరిగిన సైన్స్ ఫెయిర్ లో ఉపాధ్యాయుల విభాగంలో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి కి ఎంపికైన ZPHS వరదయ్యపాలెం భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇంచార్జ్ శ్రీ కందేరి మేఘనాధ్ గారికి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ శేఖర్ గారు మరియు జిల్లా సైన్స్ అధికారి శ్రీ భాను ప్రసాద్ గార్ల చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
ప్రదర్శన: స్మార్ట్ బ్లైండ్ స్టిక్ మరియు Aurdino UNO coding. ఈ స్మార్ట్ బ్లైండ్ స్టిక్ ను ఉపయోగించుకుని దివ్యాంగులు ఇతరుల సహాయం లేకుండా నడవడానికి వీలవుతుంది. ఈ స్మార్ట్ స్టిక్ లో aurdino కోడింగ్ ఎలా చేయాలి , సులభంగా సర్క్యూట్ ను ఎలా కలపాలి అనే విషయాలను చక్కగా వివరించారు. కేవలం వెయ్యి రూపాయలతో ఈ స్టిక్ ను ఉపయోగించుకుని దివ్యాంగులు సులభంగా నడవవచ్చు. దీనితోపాటు స్మార్ట్ షూ, స్మార్ట్ బెల్ట్, స్మార్ట్ హాట్ మరియు స్మార్ట్ స్పెక్టికల్స్ గురించి చక్కగా వివరించారు. తమ పాఠశాలల్లో ఉన్న ATL లాబ్స్ ఉపయోగించుకుని పిల్లలు ఇటువంటివి మరెన్నో నూతన ప్రాజెక్టు లను చేయాలని పిల్లల్ని కోరారు.
తిరుపతి :జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి కి ఎంపికైన ZPHS వరదయ్యపాలెం భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కందేరి మేఘనాధ్
RELATED ARTICLES