వరదయ్యపాలెం: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగనందాపురం సమీపంలో జలమాయమైన దృశ్యం..
దుర్వాసనతో అల్లాడుతున్న ప్రజలు
వరదయ్యపాలెం మండలం నాగనందాపురం లో నీటి గుంట్ల రోడ్లలో ప్రజల దుర్వాసనతో అల్లాడుతున్నారు వర్షం కురిస్తే చాలు రోడ్డుపై నీటి నిల్వ నిలచపోయి మురికి నీరుగా మారుతుంది దానితో దోమలు రాత్రి వేళలో ప్రజలపై దాడులు చేస్తున్నారు రోడ్డుపై ప్రజలు వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిందే వర్షం కురిసినప్పుడల్లా నీరు నిలిచిపోతుంది సిమెంట్ రోడ్డు లేక నిలిచిపోయిన మురికి నీళ్లు.దీంతో తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుంది. ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు రోడ్డుపై బర్రెలు, ఆవులు కట్టేసి వాటి మూత్రం, వాటి ఎరువు కూడా నిల్వ ఉంటుంది. దీంతో ఎక్కువగా దుర్వాసన వెదజల్లుతుంది దోమలు విపరీతంగా దాడులు చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు దుర్వాసన తట్టుకోలేకపోతున్నారు ఇప్పటికైనా పంచాయితీ అధికారులు తగు చర్యలు తీసుకొని రోడ్డు పైకి నీరు నిల్వ కాకుండా చేయాలని నివారించాలని డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
భారీ వర్షాలకు నాగనందాపురం సమీపంలో జలమయమైన దృశ్యం..
RELATED ARTICLES