TEJA NEWS TV: జర్నలిస్టుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం – ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సామర్ల హరి, గుత్తి త్యాగరాజు
మూడు సెంట్లు స్థలం కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదించడం హర్షనీయం
కృతజ్ఞత తెలుపుతూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
జర్నలిస్టుల జీవితాల్లో వెలుగులు నింపేలా ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలకు ఆమోదం తెలపడం శుభ పరిణామం అని వరదయ్యపాలెం ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సామర్ల హరి, గుత్తి త్యాగరాజు పేర్కొన్నారు.సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.జర్నలిస్ట్ ల ఆధ్వర్యంలో సీఎం కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సామర్ల హరి మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంలో జర్నలిస్టులు తమ సమస్యలను,ఇంటి స్థలాల విషయంను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దాని ఫలితం ఇప్పుడు ఈ రూపంలో ఇచ్చారని తెలిపారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సెక్రటరీ గుత్తి త్యాగరాజు మాట్లాడుతూ జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలపడంతో జర్నలిస్టుల కుటుంబాల్లో పండుగ వాతావరణం ముందే సీఎం తీసుకొచ్చారని అన్నారు.ఇందుకోసం కృషి చేసిన పౌర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ కు ధన్యవాదములు తెలిపారు.జర్నలిస్టులకు సీఎం పండుగ కానుక ప్రకటించారన్నారు.15 ఏళ్ల తర్వాత జర్నలిస్టుల కల సాకారం అవుతుండటం యావత్ జర్నలిస్టుల కళ్ళల్లో ఆనందం నెలకొందన్నారు.ఈ కార్యక్రమంలో సురేష్,ఉమా మహేష్,నాగార్జున,దిలీప్,మాయారి మహేష్,ఇళయరాజా,ఎలియాజర్ పల్లిపట్టు ,రాఘవ,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
వరదయ్యపాలెం: జర్నలిస్టుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం – ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు సామర్ల హరి,గుత్తి త్యాగరాజు
RELATED ARTICLES