TEJA NEWS TV:
ఒంటిమిట్ట అక్టోబర్ 31
దాసరి శేఖర్ రిపోర్టర్. ఒంటిమిట్ట
కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళ కార్యదర్శి ఓబినేని సుబ్బమ్మ, మండల టిడిపి అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయము వెనుక వైపున భారీగా బాణాసంచా పిలుస్తూ సంబరాలు చేసుకున్నారు. నిజం గెలిచిందని మా నాయకుడు చంద్రబాబు నాయుడు పై వైసిపి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని సుప్రీంకోర్టులో పూర్తిగా కేసు తొలగిస్తారని న్యాయవ్యవస్థ పై మాకు నమ్మకం ఉందని అన్నారు. వైసిపి ప్రభుత్వానికి సర్వేలు వ్యతిరేకంగా వస్తూ ఉంటే చూసి ఓర్వలేక తప్పుడు కేసులు పెట్టారని ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని ఇదే మీకు చివరి ఎలక్షన్ అని వారు. అన్నారు ఈ కార్యక్రమంలో మామిళ్ళ ఈశ్వరయ్య,, ఎంవి రమణ, వీరాంజనేయుల రెడ్డి, కిరణ్ స్వామి, మౌలాలి, ఐవారయ్య, రామదాసు, రాంప్రసాద్, నరసింహులు, వెంకటసుబ్బయ్య, ఈశ్వరయ్య, హరితదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.
ఒంటిమిట్టలో అంబరాన్ని అంటిన సంబరాలు
RELATED ARTICLES