కర్నూలు జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణమే పరిష్కరించాలని బి.డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్ డిమాండ్ చేశారు.మంగళవారం నాడు పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా బి.డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్ మాట్లాడుతూ ఈ నెల 19 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గ పర్యటన సందర్భంగా జిల్లాలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కర్నూలు జిల్లాలో బి.సి.,ఎస్.సి,ఎస్.టి వసతి గృహాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాలలో అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా వ్యాప్తంగా నాడు నేడు కార్యక్రమం కింద విద్యార్థులకు వసతి గృహాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.అన్ని రంగాలలో వెనుకబడిన కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వలస నివారణ చర్యలు చెప్పట్టి,వారి కుటుంబాల లోని విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల ఫీజుల నుండి రాయితీ కల్పించాలని కోరారు. ప్రధానంగా ఎమ్మిగనూరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని రంగాల కోర్సులను ప్రవేశపెట్టి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ప్రతీ మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.నాడు నేడు ద్వారా విద్యాలయాలు అభివృద్ధి అని చెప్పి నేడు పాఠశాల విలీనం పేరుతో గ్రామీణ విద్యార్థులను ప్రాధమిక విద్యకు సైతం దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ సంవత్సరం నూతన జబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి నేడు జబ్ లేని క్యాలండర్ తో నిరుద్యోగులను నట్టేటముంచడాని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే ఎన్నికలో ఇచ్చిన హామీలను అమలు చేసి జిల్లాలో పర్యటించాలని కోరారు.
విద్యారంగ సమస్యలు ముఖ్యమంత్రి పరిష్కరించాలి
బి.డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పగడాల రమేష్
RELATED ARTICLES