TEJA NEWS TV:
కోసిగి తేజ న్యూస్ ప్రభాకర్ :
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దళితుల జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధులు కేటాయించి దళితుల ప్రత్యక్ష ప్రయోజనాలకే ఖర్చు చేయించే విధంగా 2013.లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పోరాడి సాధించామని దళితులకు న్యాయంగా ఖర్చు పెట్టాల్సిన సబ్ ప్లాన్ నిధులను ఎందుకు ఖర్చు పెట్టరని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ దేవ సహాయం ప్రశ్నించారు.
బుధవారం కోసిగి మండల పరిధిలోని దిద్ది గ్రామంలో కెవిపిఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన నూతన కెవిపిఎస్ పతాకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ దేవ సహాయం పతాకావిష్కరణ చేశారు.మరి అనంతరం కెవిపిఎస్ మండల నాయకులు ముక్కురన్న అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ దేవ సహాయం కోసిగి మండల కార్యదర్శి రామకోటి హనుమంతు
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాడి సాధించిన సబ్ ప్లాన్ చట్టం అమలై పది సంవత్సరాలు పూర్తయినా కేటాయింపుల్లో లోపంతో పాటు కేటాయించిన నిధులను సైతం పక్కదారి పట్టిస్తున్నారన్నారు.మరి మా నిధులను మాకే ఖర్చు చేయండి అనే చైతన్యం లేని కారణంగా పాలకుల మోసాలు కొనసాగుతున్నాయన్నారు.మరి జగన్ అధికారంలోకి వస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని భావించిన దళితులకు నిరాశే మిగిలిందన్నారు.మరి పాలకులు ఎవరున్నా సరే దళితులను మోసం చేస్తూనే ఉన్నారని ఇప్పటికైనా మనమంతా మన హక్కుల కోసం మాట్లాడే వాళ్ళుగా తయారు కావాలన్నారు.మరి డప్పు చర్మకారుల కోసం కొంత మనం పోరాడి సాధించినా స్మశానాల్లో గుంతలు తీసే వాళ్ళని ఇప్పటికీ వృత్తిగా గుర్తించలేదన్నారు.మరి స్థలం ఉన్నా లేకపోయినా ఎలాంటి రక్షణ సౌకర్యాలు లేకపోయినా స్మశానంలో వృత్తి నిర్వహిస్తున్న కాటికాపర్లను 4.వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి భృతిని కల్పించాలన్నారు.మరి దళితుల అన్ని రకాల సమస్యల పరిష్కారానికై మనమే గట్టిగా గలమెత్తి గర్జించాలని వారు పిలుపునిచ్చారు.మరి జెండా ఆవిష్కరణ అనంతరం జరిగిన సభలో కాటికాపరులు డప్పు కళాకారులు చర్మకారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.