ఎంతో చరిత్ర కలిగిన అహోబిల క్షేత్రం రానున్న రోజుల్లో అహోబిల మఠం 46వ పీఠాధిపతి చొరవతో ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో 12 కులాలకు చెందిన వారికి నిత్యాన్నదానసత్రాలు నిర్మించుకోవడానికి రెండెకరాల 12 సెంట్లు భూమికి సంబంధించి పత్రాలు నిర్వాహకులకు మంగళవారంఅహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతేంద్ర మహాదేశికన్ సమక్షంలో తాను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అహోబిలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగుల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా అపరిస్కృతంగా ఉన్న సత్రాలకు స్థలాల సమస్యను అహోబిలం 46వ పీఠాధిపతి పెద్ద మనసుతో పరిష్కరించారన్నారు. పీఠాధిపతి సమక్షంలో సత్రాల నిర్వాహకులకు అంగీకార పత్రాలు అందజేయడాన్ని ఆయన మహోత్తర కార్యక్రమం గా వర్ణించారు. సుదీర్ఘకాలంగా ఈ సమస్య పరిష్కారానికి నిర్వాహకులు అహోబిల ఆలయము, అహోబిల మఠము, తనను సంప్రదించేవారున్నారు. అయితే పీఠాధిపతి చొరవతో వారి సమస్యలు తీరాయన్నారు. స్థలాలు పొందిన వారు 15 రోజుల్లోగా చేపట్టే నిర్మాణాలకు సంబంధించి ప్లాన్ ఇవ్వాలన్నారు. అంతా సక్రమంగా ఉంటే నిర్మాణ పనులు చేపట్టి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలన్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి స్థలాలు అందజేసిన సత్రాలు సేవలందించాలన్నది పీఠాధిపతి ఆకాంక్ష అన్నారు. ఆరు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేస్తామని నిర్వాహకులు ఆమోదం తెలపడం అభినందనీయమన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండడంతో ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయవచ్చునన్నారు. సత్రాల నిర్వాహకులు ఆరు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేస్తారని గంగుల ప్రతాపరెడ్డి విశ్వాసం చేశారు. నిత్యాన్నదాన సత్రాలు సేవలు ప్రారంభిస్తే అహోబిలం వచ్చే భక్తులకు అన్న పానీయాలకు ఇబ్బంది లేకపోవడంతో క్షేత్రానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉందన్నారు. అహోబిలం అభివృద్ధి చెందడానికి నిత్యాన్నదాన సత్రాల నిర్మాణం ఎంతో అవసరమని గంగుల ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రం రానున్న రోజుల్లో అహోబిల మఠం 46వ పీఠాధిపతి చొరవతో ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుంది- మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి
RELATED ARTICLES