

సగరులు ఉప్పరులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా రాణించాలి…
సగర సాధికారిత టీడిపి రాష్ట్ర కన్వీనర్ జంప వీర శ్రీనివాసులు.
ఘనంగా భగీరథ విగ్రహా 6 వ వార్షికోత్సవం..
Teja News TV… శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం..
హిందూపురం పట్టణం బైపాస్ రోడ్డు ఆటోనగర్ భగీరథ సర్కిల్ నందు సగర ఉప్పర సంక్షేమ సంఘం అధ్వర్యంలో మంగళవారం నాడు భగీరథ విగ్రహ ఆరో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
భగీరథుని విగ్రహానికి పూలమాలలు వేసి భక్తి ప్రవర్తలతో పూజలు నిర్వహించారు.
అనంతరం సగర ఆత్మీయ సమావేశం నిర్వహించగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన. సగర సాధికారత రాష్ట్ర కన్వీనర్ జంపా వీర శ్రీనివాసులు మాట్లాడుతూ సగరులు ఉప్పరులు సనాతన ధర్మం లో ఎంతో ప్రఖ్యాతిగాంచారన్నారు . ఏదైనా ఒక కార్యక్రమం తల పెడితే తరచూ విఫలమవుతుంటే ఆ లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నం అనే వాడుక లో ఉందన్నారు అటువంటి భగీరథ మహర్షి వారసులుగా ఉన్న సగరులు ఉప్పరులు ఆయన స్ఫూర్తితో అన్ని రంగాల్లో కూడా విజయం సాధించడానికి భగీరథ ప్రయత్నం చేస్తూనే ఉండాలనీ అన్నారు. ఇప్పుడిప్పుడే సగరులు అన్ని రంగాల్లో రాణించడానికి కృషి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో సగరుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు సగర కోఆపరేటివ్ సొసైటీ ద్వారా సగరను ఆర్థికంగా ఆదుకోవడం జరిగిందన్నారు.
భవిష్యత్తులో కూడా సగరులకు టిడిపిలో తగు ప్రాధాన్యత ఉంటుందని సగరుల ఉప్పరుల అభివృద్ధి కోసం పార్టీ కృషి పేర్కొన్నారు. భగీరథ విగ్రహం ఏర్పాటు కు స్థానిక శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సహాయ సహకారాలు సగరులు ఎప్పటికీ మరవరని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ పట్టణ అధ్యక్షులు డి. ఈ రమేష్ కుమార్ నాయకులు నాగరాజు రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజనప్ప అమర్నాథ్ సగర సాధికారతర పార్లమెంట్ కన్వీనర్ వెంకటనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్ గణేష్ చంద్రశేఖర్ సంఘం సభ్యులు రామప్ప మారుతి రామన్న చాలెంజ్ రాముడు పోచనపల్లి శ్రీనివాసులు , అశ్వర్తప్ప ఎంపీటీసీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.