
TEJA NEWS TV :
గత 10-11-2021 నాడు కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో శ్రీ తిమ్మయ్య గారి సుశీల & నారాయణరెడ్డిల పేరు మీద ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి గారు తన సొంత ఖర్చులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీ. కల్వకుంట్ల తారకరామారావు గారు, మరియు శ్రీ.సబితా ఇంద్రారెడ్డి గారు, జిల్లా మంత్రి శ్రీ. వేముల ప్రశాంత్ రెడ్డి గారితో పాటు స్థానిక శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారు కూడా హాజరై మంత్రి తారక రామారావు గారు మాట్లాడుతూ.. ఇంత చారిత్రాత్మక గ్రామానికి తొమ్మిది అనుబంధ గ్రామాల నుండి వందల మంది విద్యార్థులు సుదూర ప్రాంతాలకు చదువుకోడానికి వెళుతున్నందున అంతే కాకుండా మంచి స్కూలు ప్రారంభించుకుంటున్న శుభ సందర్భంగా జూనియర్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు శ్రీ. కల్వకుంట్ల తరకరామారావు కూడా వేదిక మీదే ప్రకటించారు. ఇలా ప్రకటించి మూడు సంవత్సరాలు అవుతుంది..
కావునా ఈ విద్యా సంవత్సరం బీబీపేట మండలం కోనాపూర్ గ్రామానికి త్వరలో వెంకటమ్మగారి పేరు మీద పాఠశాలను ప్రారంభించేందుకు వస్తున్నందున..
ఈ సందర్భంలోని జూనియర్ కళాశాలను ప్రారంభించి వెళ్లవలసిందిగా ఈ ప్రాంత వాసులుగా తమరితో విజ్ఞప్తి చేస్తున్నము..
అంతేకాకుండా ఈ యొక్క కళాశాలలో ముఖ్యంగా కోర్సులు MPC, BIPC, CEC తో పాటు వొసెషనల్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఏర్పాటుతో పాటు శాశ్వత అధ్యాపక ,అధ్యాపకేతర సిబ్బందిని కూడా నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ విషయమై ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి ల దృష్టికి తీసుకు వెళ్లాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికి ప్రేమ కుమార్ గారికి, మండల ఎంపీపీ బాలమని మరియు రవీందర్ రెడ్డి గార్లకు వినతి పత్రాలు సమర్పిండం జరిగింది.



