TEJA NEWS TV:
గౌరవనీయులైన హొళగుంద మండల మరియు గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు నాయకులు మేధావులు విద్యావంతులు యువత మహిళలు అందరికీ నమస్కారములు. మనందరికీ ఎంతో అవసరం అయిన ఆదోని ధనాపురం హొళగుంద రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా కలగానే మిగిలిపోయింది. ప్రారంభించిన రోడ్డు పనులు మధ్యలోనే ఆగిపోయాయి. రోడ్డు లేకపోవడం వల్ల మనమందరం ఎదుర్కొంటున్న అవస్థలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ రోడ్డు పనులు తిరిగి ప్రారంభం కాలేదు. మనకు ఎంతో అవసరమైన రోడ్డును వేయించుకునే దిశగా మన మండలంలో ఉన్న అన్ని వర్గాలను కలుపుకుని కులమత రాజకీయాలకు అతీతంగా రోడ్డు కోసం ప్రయత్నం పోరాటం ఉద్యమం అనే కార్యక్రమాల ద్వారా ఒత్తిడి తెచ్చి రోడ్డు పనులు ప్రారంభించే వరకు నిరవధికంగా ముందుకు పోవాలని ప్రయత్నిస్తున్నాము. ఈ కార్యక్రమం ఏ ఒక్కరికి అనుకూలం కాదు వ్యతిరేకము కాదు. ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి ఒక జేఏసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కుల మత రాజకీయాలకు అతీతంగా మండల మరియు గ్రామాలలోని పెద్దలు ప్రజా ప్రతినిధులు నాయకులు పాత్రికేయ మిత్రులు రాజకీయ పార్టీల నాయకులు ప్రజాసంఘాలు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు యువజన సంఘాలు మహిళా సోదరీమణులు మేధావులు విద్యావంతులు యూనియన్ నాయకులు రోడ్డు సాధన కోసం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జేఏసీ ఏర్పాటు కోసం నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొని కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరి అమూల్యమైన సలహాలు సూచనలతో పాటు సహకారం మద్దతు తెలిపి భాగస్వామ్యం వహించాలని రోడ్డు సాధనకు అండగా నిలబడాలని కోరుతున్నాను
అందరికీ ధన్యవాదాలు
ఆదోని ధనాపురం హొళగుంద రోడ్డు నిర్మాణ సాధన కోసం జేఏసీ ఏర్పాటు సమావేశం
RELATED ARTICLES