TEJA NEWS TV: జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో నేడు ఎమ్మిగనూరు మండలం దేవబెట్ట గ్రామానికి చెందిన స్వామి దాసు,రాజేష్ లపై 29-5-2023 వ తేదీన అదే గ్రామానికి చెందినటువంటి గొల్ల కులస్తులు కేపీ విరేషు,ఈరన్న,చిన్న వీరేష్ ఉరుకుందులు మరి కొంతమంది కలిసి రాత్రిపూట కరెంటు బంద్ చేసి కట్టెలతో,రాళ్లతో విచక్షణ రహితంగా అత్యాయత్నానికి పాల్పడ్డారు. స్వామి దాసు,రాజేష్ ఎమ్మిగనూరు టౌన్ ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ ఉన్న వారిని జై భీమ్ ఎమ్మార్పీఎస్ నాయకులు పరామర్శించి ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధి నందు దళితు,గిరిజనులపై రోజు రోజుకు ఏదో ఒక రకమైన దాడులు జరుగుతూనే ఉన్నవి.వీటిని అరికట్టడంలో పోలీసు వ్యవస్థ,రెవిన్యూ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. దాడి చేసిన నిందితులను ఇంతవరకు ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ వారు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా,అరెస్టు చేయలేకపోవడం దుర్మార్గమైన చర్య అని మాట్లాడి,వెంటనే నిందితులపై కేసు నమోదు చేయలేకపోతే ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని మాట్లాడడం జరిగింది. జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జడ రవి,కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్తు సుమాల,ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి సురేష్ సుమాల మరియు దేవబెట్ట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
దళితులపై దాడులు చేయడం సిగ్గుచేటు
RELATED ARTICLES