TEJA NEWS TV Holagunda Reporter Arun Kumar:
ప్రేమించుకున్న జంటను పెద్దలు కాదనడంతో ఎం ఆర్ పి ఎస్ నాయకులు ఆ జంటకు వివాహం చేశారు. కర్ణాటక రాష్ట్రం చిక్ బళ్లారి గ్రామానికి చెందిన వినోద్, సిరిగుప్ప తాలుగా కే బెళగల్ గ్రామానికి చెందిన మాయావతి ఇద్దరూ ఎస్సీ మాదిగ కులానికి చెందిన మేజర్లు. ఇద్దరూ డిగ్రీ వరకు చదువుకున్న విద్యావంతులు. తాము కాలేజీలో ఉన్నప్పుడే ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుని తమ తల్లిదండ్రులు నిరాకరించడంతో ఎం ఆర్ పి ఎస్ నాయకులను ఆశ్రయించారు. దీంతో హొళగుంద మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వెంకటేష్ మాదిగ ఆ ప్రేమికుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి వీరి యొక్క వివాహాన్ని సిరుగుప్ప దాసనూరు మధ్యలో ఉన్నటువంటి శంభు లింగేశ్వర దేవస్థానం వద్ద సోమవారం జరిపించారు. తల్లిదండ్రులు వద్దన్నా వారిని ఒప్పించి ఈ పెళ్లి చేశామని భవిష్యత్తులో ఎవరికి ఎటువంటి చెడ్డ పేరు లేకుండా అందరూ సంతోషపడేలా కలిసి జీవించాలని వారికి మంచి మాటలు చెబుతూ కలకాలం పిల్లాపాపలతో జీవించాలని ఆశీర్వదించారు.
ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో పెళ్లి
RELATED ARTICLES