TEJA NEWS TV : ఆళ్ళగడ్డ డివిజన్ లోని రుద్రవరం
మండలం లోని నరసాపురం గ్రామం లోని రైతు భరోసా కేంద్రం లో ప్రకృతి వ్యవసాయం లో ” నవధాన్యాల సాగు-నేల తల్లి బాగు కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను, పేపర్ పాంప్లెట్స్ ను రుద్రవరం మండల వ్యవసాయ AO అధికారిని జ్యోతి విడుదల చేయడం జరిగినది. 30 రకాల విత్తనాలు తొలకరి చినుకులకు ముందు భూమిలో చల్లుకుని 45-60 రోజుల తర్వాతా భూమిలో కలియ దున్నుకోవడం వల్ల భూమి సారవంతమై భూసారం పెరుగుతుంది అని వివరించారు.
దీని ద్వారా భూమిలో పోషకాలు పెరిగి భూమి సారవంతంగా మారుతుంది. గ్రామంలో ప్రకృతి వ్యవసాయం లో KAP ప్రణాళికలు తయారు చేస్తున్నారని ప్రతి రైతు ప్రణాళికలు చెప్పాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ మహబూబ్ బాష, అహోబిలం హరి MCA శివ శంకర్, L2 లక్ష్మీ చరిత దేవీ,icrp లు మరియు సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
నవధాన్యాల సాగు-నేల తల్లి బాగు కార్యక్రమ గోడపత్రికలను విడుదల చేసిన వ్యవసాయ అధికారి
RELATED ARTICLES