TEJA NEWS TV :
👉 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 26న అనంతపురం జిల్లా నార్పల పర్యటనను అడ్డుకుంటామని దండోరా ఎమ్మార్పీఎస్ ఆలూరు నియోజకవర్గం అధ్యక్షులు కత్తి రామాంజనేయులు మాదిగ హెచ్చరించారు.శనివారం ఆలూరు స్థానిక ఆర్.అండ్.బీ బంగ్లాలో జరిగిన ఎమ్మార్పీఎస్ తాలూకా మరియు మండలం స్థాయి అత్యవసర సమావేశనికీ ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షులు కత్తి రామాంజనేయులు మాదిగ గారు, హాలహర్వి మండలం అధ్యక్షులు గూళ్యం ఎల్లప్ప హొళగుంద మండలం అధ్యక్షులు పంచగుండిగ వెంకటేష్ మాదిగ గారు, హాజరైయ్యారు.
👉 ఈ సందర్భంగా కత్తి రామాంజనేయులు మాదిగ మాట్లాడుతూ మాదిగల ప్రధాన డిమాండ్ ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీలు గా వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించడంలో వైసిపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.
👉 ఎస్సీ కార్పోరేషన్ ను మూడు భాగాలుగా ముక్కలు చేసి వాటికి నిధులు లేకుండా నిర్వీర్యం చేశారని వెంటనే మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి.
👉 రద్దు చేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి.
👉 రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ లపై జరుగుతున్న దాడులు దౌర్జన్యలను అరికట్టాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్ట పరిచాలని డిమాండ్ చేశారు.
*ఆలూరు నియోజకవర్గం నుండి ఎమ్మార్పీఎస్ నాయకులు బయలుదేరి ముఖ్యమంత్రి పర్యటన ను అడ్డు కుంటాము
👉 ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు హత్తిబెళగల్ రాజు గుడుదప్ప కె.బసప్ప ,అయ్యప్ప, బసవరాజు, జి.దానప్ప, గాదిలింగ, తదితరులు పాల్గొన్నారు
సిఎం పర్యటనను అడ్డుకుంటాం…ఎమ్మార్పీఎస్ ఆలూరు నియోజకవర్గం అధ్యక్షులు కత్తి రామాంజనేయులు మాదిగ
RELATED ARTICLES