TEJA NEWS TV: హొళగుంద మండలంలోని
సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి శ్రీనివాసరావు ఐఏఎస్ ను విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఎం ఆర్ పి ఎస్ నాయకులు వెంకటేష్ మాదిగ కలిసి వినతి పత్రం సమర్పించారు. బుధవారం విజయవాడలోని పటమట లో గల సమగ్ర శిశు పథక రాష్ట్ర సంచాలకుల వారి కార్యాలయంలో దళితులైన బాధితులు బి కృష్ణారావు , హరిజన లక్ష్మి ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం సమర్పించి సహాయం చేయాలని న్యాయం అందించాలని కోరారు. బాధితుడు బి కృష్ణారావు గతంలో ఆలూరు పట్టణంలో ప్రభుత్వ బాలుర పాఠశాల 1 లో ఆర్ట్ టీచర్ గా పనిచేసినాడని, ఎటువంటి రిమార్కులు లేని దళితుడైన బి కృష్ణారావును అకారణంగా విధుల నుంచి తొలగించినారని, అతనిని విధుల నుంచి తొలగించినప్పటి నుంచి ఆ పాఠశాలలో ఆర్ట్ టీచర్ పోస్ట్ ఖాళీగానే ఉందని విన్నవించారు. విధుల నుంచి తొలగించడంతో వేరే ఉపాధి అవకాశం లేక కుటుంబంతో కూలీ పనులకు పోతున్నాడని ఎవరితో భర్తీ చేయక ఖాళీగా ఉన్నటువంటి పోస్టులో అక్కడ గతంలో పనిచేసిన కృష్ణారావును ఆర్ట్ టీచర్ గా నియమించి న్యాయం చేయాలని విన్నవించారు. అలాగే దళిత మహిళ హరిజన లక్ష్మి హొళగుంద కస్తూరిబా గాంధీ పాఠశాలలో దినసరి వేతనంపై ఆయాగా పనిచేస్తోందని, అయితే ఐ ఎం ఎం ఎస్ అప్ లో సమస్య ఉందని ఆమె పేరు రిజిస్టర్ కావడం లేదని ఆ దినసరి కూలీకి వేతనం చెల్లించడం లేదని తెలిపారు. ప్రతిరోజు అక్కడ ఉంటున్న విద్యార్థులకు శుభ్రతను కల్పిస్తూ బాత్రూం మరుగుదొడ్లను శుభ్రపరుస్తూ పనిచేస్తున్న దళిత మహిళలకు వేతనం చెల్లించాలని, ఐ ఎమ్ ఎమ్ ఎస్ యాప్ లో రిజిస్టర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఎం ఆర్ పి ఎస్ నాయకులు వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ దళితులకు సహాయం అందించి ఉపాధి కల్పించాలని వేతనాలు అందించాలని కోరారు. వరేలు శేఖర్, బి కృష్ణారావును సమగ్ర పతక సంచాలకుల వారిని కలిసి న్యాయం కోసం విన్నవించారు.
సమగ్ర శిక్ష ఎస్ పిడికి వినతి పత్రం సమర్పించిన MRPS నాయకులు
RELATED ARTICLES