
TEJA NEWS TV : ఆంధ్రప్రదేశ్ మదాసి మదారి కురువ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంఘం ద్వారా యువగలం పాదయాత్రలో భాగంగా దేవనకొండ మండలం పరిధిలోని వెంకటాపురం గ్రామ సమీపంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది విషయం ఏమనగా మా మదాసి కురువ సామాజిక వర్గానికి S.C కుల సర్టిఫికెట్ జారీ విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నది రెవెన్యూ అధికారులు మమ్మల్ని కుల మార్పిడి చేసి BC -B-11 సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతున్నది ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా తెలియజేయడం జరిగింది..
అలాగే కర్నూలు పార్లమెంటు పరిధిలో మదాసి&మదారి కురువలు దాదాపుగా 2.50 లక్షల పై చిలుక కురువ ఓటరు జనాభా కలదు అత్యధికంగా ఆలూరు నియోజకవర్గంలో దాదాపుగా 62 వేల కురువ ఓటరు జనాభా కలదు అయినా మా సామాజిక వర్గంకు రాజకీయంగా ఏ పార్టీ కూడా మాకు అవకాశం ఇవ్వలేదు ఇంతవరకు ఏ పార్టీ కూడా కర్నూలు జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యే స్థాయి పదవులు మాకు ఇవ్వలేదు కావున కర్నూలు జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన కురువ సామాజిక వర్గానికి ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యేలు సీటు ఇవ్వాలని మా కోరికను మన్నించి మీరు మాకు 2 ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు ఖరారు చేస్తే కచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మదాసి కురువ సామాజిక వర్గం తరపున ప్రమాణ పూర్తిగా మీకు మాట ఇస్తున్నామని తెలియజేయడం జరిగింది మా విన్నపాని ఆలకించి స్పందించిన నారా లోకేష్ గారు మీకు న్యాయం చేస్తానని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలూరు తాలూకా మదాసి కురువ కులస్తులు వందల మంది పాల్గొనడం జరిగింది .



