
TEJA NEWS TV Holagunda Reporter Arun Kumar : ఈరోజు ఆలూరు నియోజకవర్గం కేంద్రంలో ఉన్న మదాసి కురువ సంఘం కార్యాలయంలో ఆలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని మండలాల కురువ నాయకులు కలిసి తాలూకా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ గౌరవ అధ్యక్షుడు మోహన్ ప్రసాద్ సీనియర్ నాయకుడు కోగిల తోట శేషప్ప రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగమల్లప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామమోహన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కారుమoచప్ప వీరి పర్యవేక్షణలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కమిటీలో స్థానం పొందిన వారు ఆలూరు తాలూకా గౌరవ అధ్యక్షుడు జి రంగన్న, తాలూకా కన్వీనర్ కౌడికి రాజు, కో కన్వీనర్ నిట్రవట్టి బసవరాజు, తాలూకా ప్రధాన కార్యదర్శి పెద్దహేట మల్లయ్య, సహాయ కార్యదర్శి కురువెల్లి రమేష్, కోశాధికారి నెరినికి మఠం మహేష్, కార్యవర్గ సభ్యులుగా సంఘాల గిరప్ప, తంగారదోన నరేష్, చిప్పగిరి పూజారి శివలింగప్ప, ఆలూరు తాలూకా మదాసి కురువ సంఘం సోషల్ మీడియా కన్వీనర్ లింగమూర్తి. వీరిని ఆలూరు నియోజకవర్గంలో ఉన్న మాదాసి కురువలు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం నాయకులు మాట్లాడుతూ కొత్తగా ఎన్నుకోబడ్డవారు నియోజవర్గంలో అన్ని గ్రామాల్లో మన కులస్తులను చైతన్యపరిచి రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా ఎదిగే విధంగా చైతన్యం చేయాలని అలాగే రాబోయే రోజుల్లో రాజకీయంగా బలపడే విధంగా కార్యాచరణలు రూపొందించుకోవాలని రాబోయే ఎలక్షన్లలో మనం కూడా కీలకపాత్ర పోషించే విధంగా ఉండాలని కొత్తగా తాలూకా కమిటీలో స్థానం పొందిన సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీ స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది..



