TEJA NEWS TV: ఆళ్లగడ్డ పట్టణంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నిర్వహణ తీరును సోమవారం ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఇడమకంటి సుధాకర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలోని సెయింట్ ఆన్స్ పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల,రాఘవేంద్ర హై స్కూల్ సెంటర్లను ఆయన తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు తీరును, బందోబస్తు నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ వ్యాప్తంగా ఆళ్లగడ్డ రూరల్, కోయిలకుంట్ల సర్కిల్,సిరివెళ్ల సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో SSC పరీక్షా కేంద్రాలలో ఇప్పటివరకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.ఎలాంటి మాస్ కాపీ కు తావు లేకుండా తమ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట ఈ తనిఖీలో అర్బన్ ఎస్ఐ వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు.
SSC పబ్లిక్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆళ్లగడ్డ డిఎస్పి సుధాకర్ రెడ్డి
RELATED ARTICLES



