TEJA NEWS TV:
నంద్యల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ళ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు మాజీ మంత్రి , ఆళ్లగడ్డ టీడీపీ ఇంచార్జ్ భూమా అఖిల ప్రియ అదేశాల మేరకు మండల కన్వీనర్ కాటం రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరియు మాజీ జెడ్పీటీసీ యమా గురప్ప అధ్వర్యంలో స్థానిక టిడిపి నాయకులు తో పెరిగిన విద్యుత్ చార్జీలపై నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పెరిగిన విద్యుత్ చార్జీలకు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చే ముందు ధరలు పెంచమని అధికారంలోకి వచ్చి ధరలన్నీ విపరీతంగా పెంచేస్తున్నారని అన్నారు. అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
శిరివెళ్ల: పెరిగిన విద్యుత్ చార్జీలపై తేదేపా నేతల నిరసన
RELATED ARTICLES