TEJA NEWS TV :
జాతీయ తెలుగుదేశం పార్టీ నిర్ణయం మేరకు
ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి ఆదేశాల మేరకు….
హోలగుంద పట్టణంలో టీడీపీ మండల కన్వీనర్ dr తిప్పయ్యా గారి ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి అని ధర్నా కార్యక్రమం నిర్వహించారు….
ఈ సందర్భంగా మండల కన్వీనర్ dr తిప్పయ్య మాట్లాడుతూ 2014వ సంవత్సరముముందు లోటు 1.2 మిలియన్ యూనిట్లు లోటు ఉండేది. 2019వ సంవత్సరము నాటికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు లోటు నుండి మిగులు విద్యుత్ తెచ్చిన ఘనత మా నాయకుడిది అని తెలిపారు. 2019వ సంవత్సరము నుండి జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నారని తెలిపారు. పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ దద్వారా అప్పులు తెచ్చి మొత్తం రూ. 57,188 కోట్ల భారాన్ని విద్యుత్ వినియోగదారులపై మోపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జెన్కో, సీజిఎస్ లలో ఒక యూనిట్ విద్యుత్ సరాసరి రూ. 5/- లకే వస్తున్నది . కానీ ప్రభుత్వ సంస్థలలో విద్యుత్ ఉత్పత్తి చేయకుండా నిలిపివేసి కమిషన్ల కోసం ఒక యూనిట్ సరాసరి రూ.9/- పెట్టి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసారు. బహిరంగ కొనుగోళ్లకు రూ.12,200 కోట్లు ఖ్జర్చు చేసారు. ఈ వేసవి కాలములో ప్రజలకు విద్యుత్ అంతరాయము లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి. దానికి తోడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే 24 గంటలలోపు వాటిని పునరుద్ధరణ చేయాలని విద్యుత్ అధికారులను కోరారు. మోటర్లకు మీటర్లు బిగిస్తే వాటిని పగులకొడతామని బికె పార్థసారథి గారు హెచ్చరించారు. ప్రజలకు, రైతులకు సంబంధించిన విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పూజారి రామలింగ, బజెరి హుసేనీ ,గేజ్జ హల్లి నబిరసుర్, రమేష్, ఎండీ హళ్లి సర్పంచ్ సుధాకర్, ఉప సర్పంచ్ సవారీ , జుమ్మా సలీమ్, టి గదిలింగాప్ప ,tnsf మండల అధ్యక్షుడు మల్లికార్జున, యువ నాయకులు మంజునాథ్ గౌడ్, తిక్క స్వామి, మోయిన్, వివిధ పదవులలో ఉన్న నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.