వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని శ్రీరామనవమి పర్వదినాన గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలోచలివేంద్రం ప్రారంభించినట్లు గ్రీన్ సొసైటీ అధ్యక్షుడు దండు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు… వేసవికాలం ముగిసే వరకు 70 రోజులపాటు చలివేంద్రాన్ని నిర్వహించనున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.. ప్రతి ఏడాదిలాగే శ్రీనివాస నగర్ లోని రామకృష్ణ డిగ్రీ కళాశాల కు వెళ్లే రహదారిలో ఈ ఏడాది కూడా చలివేంద్రం ఏర్పాటు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు . సొసైటీ గౌరవాధ్యక్షులు రఘువీర్ మాట్లాడుతూ వేసవిలో ప్రతి ఏడాది గ్రీన్ సొసైటీ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసే చలివేంద్రాన్ని ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకోవడం హర్షణీయమన్నారు… ఈ ఏడాది చలివేంద్రం నిర్వహణకు సహకారం అందించిన సొసైటీ గౌరవ సలహాదారు గంగవరం మల్లేశ్వర్ రెడ్డిని సలహా సభ్యుడు బత్తుల శివకుమార్ ను రఘువీర్ అభినందించారు.. చలివేంద్రం ప్రారంభం సందర్భంగా శ్రీరాముని చిత్రపటానికి గంగవరం మల్లేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పూజలు నిర్వహించారు.. అనంతరం మిఠాయిలు,వడపప్పు, పానకం పంపిణీ చేశారు.. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి పోసా శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు కేశవ, సాయినాథ్, డివి సుబ్బయ్య, శ్రీనివాసరెడ్డి, సంతోష్, భవాని తదితరులు పాల్గొన్నారు.
“గ్రీన్ సొసైటీ” ఆధ్వర్యంలో “చలివేంద్రం” ప్రారంభం
RELATED ARTICLES