Friday, March 14, 2025

ఆదోని నియోజకవర్గంలో 67వ రోజు “గడప గడపకు మన ప్రభుత్వం”కార్యక్రమం

TEJA NEWS TV:

ఆదోని నియోజకవర్గంలో 67వ రోజు “గడప గడపకు మన ప్రభుత్వం”కార్యక్రమం కపటి గ్రామంలో ( 2వ రోజులో భాగంగా) ప్రతి ఇంటి గడప ప్రజలతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా 350 గృహాలను సందర్శించి యొక్క సమస్యలు తెలుసుకొని నవరత్నాలు ప్రజలకు అందుతున్నాయా లేదా మీ యొక్క సమస్యలు ఏమిటి ఇక్కడ మంచినీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, రోడ్లు సమస్యలు ప్రతి గడపకు తిరుగుతూ అడగడం జరిగింది ఉన్న ప్రతి ఇంటికి మూడు లక్షల వరకు లబ్ధి చేకూర్చడం జరిగింది,ప్రజలు సంతోషంతో పూలమాలతో స్వాగతం పలికారు ప్రతి సంక్షేమ పథకాలు జగనన్న అమ్మఒడి, జగనన్న చేదోడు, జగనన్న తోడు ,జగనన్న వసతి దీవన, విద్య దీవన,వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత,ఇంటిపట్టాలు ప్రజలుకు అందుతున్నాయి ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందలేదు అనుకుంటే మా దృష్టికి తీసుకురావాలని ప్రజలకు చెప్పడం జరిగింది, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆదోని తెలుగుదేశం నాయకులు నలుగురు ఆదోని అభివృద్ధిపై అవేకలుగా మాట్లాడుతున్నారు బైపాస్ రోడ్డు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం ప్రజలకు ఏమి చేయాలో మాకు అన్ని తెలుసు ప్రజలు మమ్మల్ని అడుగుతారే తప్ప మిమ్మల్ని అడిగే పరిస్థితిలో లేరు మీరు తీర్చే స్థితిలో కూడా లేరు మీ పరిస్థితి అదే ఉంది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆదోని ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తాం మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు ఇక్కడ కూడా నేను కచ్చితంగా గెలవగలుగుతానని చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో గంటల తరబడి ఆఫీస్ చుట్టూ తిరిగేవారు గత తెలుగుదేశం హయంలో 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్నా మాజీ చంద్రబాబు నాయుడు రైతుల పట్లకానీ గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు గ్రామ ప్రజలు త్రాగడానికి మంచినీరు అందించలేని రైతుల వ్యతిరేకి చంద్రబాబు, ఇప్పుడు మూడు సంవత్సరాల్లో రైతు బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులు పండించడానికి వర్షలువస్తాయి RBk ద్వారా విత్తనాలు పంపిణీ , పండించిన పంటను ఉచిత బీమా చేయడం, రైతులకు సబ్సిడీల ద్వారా ట్రాకర్స్, యంత్ర పరికరాలు ఇవ్వడం ,జలకల ద్వారా ఉచిత బోర్లు వేయించడం చేయడం పండించిన పంట నష్టపోతే ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం జరిగింది. పశువుల చికిత్స కొరకు ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం గ్రామాలలో గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం 104 అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం రైతు భరోసా ఇవ్వడం ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి కి ఉందని కొనియాడారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరికి పెన్షన్ ఇస్తున్నారు అలాగే బియ్యం కూడా ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారు మన ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రభుత్వం కపటి గ్రామంలో ఉన్న సమస్యలు విద్యుత్ స్తంభాలు డ్రైనేజ్ కాలువలు, మరియు చిన్నపాటి సమస్యలన్నీ కూడా త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో సచివాలయం నిధులు ద్వారా రూ.20 లక్షలతో పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశించడం అయింది. కపటి గ్రామంలో జల జీవన్ మిషన్ పథకం నిధుల ద్వారా రూ.52 లక్షలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ద్వారా కొత్త పైప్ లైన్ తో ఇంటింటికి త్రాగినీటి కొళాయి అందించుటకు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ గారు, వైయస్సార్ మండల అధ్యక్షుడు గుర్నాథ్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ శాంతమ్మ స్టేట్ వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, మంజుల,రేణుక, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కామాక్షి తిమ్మప్ప, వైఎస్ఆర్ ఇన్చార్జి రాజు, కపటి ఎంపిటిసి కడుబురయ్య ఉప సర్పంచ్ వీరేష్ , మండలం ఎంపీపీ బడాయి దానమ్మ పంపాపతి, MPD0 గీత వాణి ఆర్ ఐ జయరాం రెడ్డి,,RWS AE నాగ మల్లయ్య, EORD జనార్ధన్, పంచాయతీ అధికారులు, హౌసింగ్ బోర్డ్ అధికారి తిప్పన్న , వైఎస్ఆర్ పార్టీ మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి, కల్పవల్లి,వైఎస్ఆర్ సీనియర్ నాయకులు మురళి రెడ్డి ,దస్తగిరి నాయుడు సుధాకర్, భాస్కర్ క్రిష్టప్ప, శంకరప్ప ,రామి రెడీ నారాయణ రాఘవేంద్ర ,మోజేష్ దేవదాస్, మంజునాథ స్వామి, చిన్న ఈరన్న సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular