కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసనూరు గ్రామంలో శ్రీ విశ్వలింగేశ్వర స్వామి రథోత్సవం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారని గుడి ప్రధాన పూజారి ఈరన్న తెలియజేశారు. తెల్లవారుజామున 5 గంటల నుండి స్వామివారికి పాలభిషేకాలు నిర్వహించిన అనంతరం పార్వతి అమ్మవారికి వస్త్రా అలంకరణ అందంగా చేశారు. స్వామివారి పూజా కార్యక్రమం అనంతరం హోమాలతో నిష్ట పూజలు నిర్వహించారు. అగసనూరు గ్రామం చుట్టుపక్కల ఉన్న సాతనూరు, కందుకూరు, మూగలదొడ్డి, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న జూకూరు, రాజలబండ, తదితర గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. గ్రామంలోని ఆడపడుచులు కలసాలతో స్వామివారి పూర్ణకుంభాని మేళాయాలతో స్వామివారి రథోత్సవం దగ్గరికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి రథోత్సవాన్ని ఊరేగించారు. స్వామివారి దర్శనం నిమిత్తం వచ్చిన భక్తులకు గ్రామ పెద్దలు గుడి ప్రధాన పూజారి ఈరన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు పాల్గొని అందరికీ అన్ని రకాల వంటకాలు అందే విధంగా భక్తులు స్వామివారి విందు సేకరించే వరకు అందరికీ వడ్డించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
అగసనూరులో ఘనంగా విశ్వలింగేశ్వర స్వామి రథోత్సవం…
RELATED ARTICLES