ఆలూరు,కర్నూలు జిల్లా నేటి తరాలను గ్రంథాలయాలకు సన్నిహితం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది ఉంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం అన్నారు.ఆదివారం ఉదయం ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సంబంధించిన పోస్టర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు కర్నూలు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి అధికారులతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగనన్న విద్య అభివృద్ధి కోసం గతంలో ఏ ప్రభుత్వం చేయని అంతా అభివృద్ధి ఒక్క జగనన్న ప్రభుత్వం జరిగిందని అని తెలిపారు.అమ్మఒడి,నాడు-నేడు ద్వారా పాఠశాలు అభివృద్ధి విద్యాదివెన,విదేశీ విద్య ఇలా చాలా కార్యక్రమాలు చేప్పట్టేందుకు ప్రతి పేద కుటుంబాలు,విద్యార్థులు సంతోషంగా ఉన్నారు అని గుర్తు చేశారు.అలాగే కర్నూలు జిల్లాలో ఈ నెల 14వ తేది నుంచి 20వ తేది వరకు జరిగే గ్రంథాలయా వారోత్సవాలు అందరూ పాల్గొన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి గారు,మండల జడ్పీటీసీ ఏరూరు శేఖర్, సర్పంచ్ దేవిరెడ్డి గ్రంథాలయా అధికారులు తదితరులు పాల్గొన్నారు..
56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పోస్టర్ విడుదల చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు
RELATED ARTICLES