తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో 50 కుటుంబాలు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. వారికి జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు బొళియాశెట్టి శ్రీకాంత్, నియోజకవర్గ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మీ కుమారి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తొలుత జనసేన పార్టీ దిమ్మె ఆవిష్కరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, మాట్లాడుతూ పెద్ద ఎత్తున యువత జనసేన పార్టీలో చేరటం చాలా ఆనందంగా ఉందని పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్క జన సైనికుడు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపాధ్యక్షుడు బొళియాశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులందరినీ అభినందించారు, పెద్ద ఎత్తున యువత జనసేన పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని పార్టీలో చేరిన జన సైనికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంపలగూడెం మండల అధ్యక్షుడు వెంకటకృష్ణ, సర్పంచ్ శ్రీనివాసరావు, షేక్ యాసిన్, కృష్ణ, నాగులమీరా తదితరులు పాల్గొన్నారు.
50 కుటుంబాలు వైసీపీ నుంచి జనసేనలో చేరిక
RELATED ARTICLES