నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం, తోడెండ్లపల్లె గ్రామానికి చెందిన నాలుగేళ్ల పాప దీక్షితపై జరిగిన అతి దారుణమైన ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. మైలవరం మండలం మొరగుడి గ్రామానికి చెందిన రహమతుల్లా అనే కిరాతకుడు, బాలికను మానసికంగా, లైంగికంగా చిత్రహింసలకు గురిచేసి, అనంతరం హత్య చేసి ముళ్ళపొదల్లో పడేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
ఈ ఘోర ఘటనపై స్పందించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చారు. నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో, నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు శ్రీమతి కల్పలత రెడ్డి సమక్షంలో, ఆళ్లగడ్డ మాజీ శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్రారెడ్డి రూ. 2 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇషాక్ భాష , నంద్యాల మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి , శ్రీశైలం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి , వైఎస్సార్సీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి , చాగలమర్రి ఎంపిపి వీరభద్రుడు, షేక్ బాబూలాల్ మరియు అనేక మంది పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఈ సంఘటనపై ప్రభుత్వ స్పందనతో పాటు న్యాయం జరగాలని గ్రామ ప్రజలు, నాయకులు కోరుతున్నారు.
4 ఏళ్ల దీక్షితపై క్రూర హత్య – బాధిత కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సహాయం
RELATED ARTICLES