TEJA NEWS TV
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు డోన్ ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కుమారుడు అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన డోన్ పట్టణానికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు వైయస్సార్ ముఖ్య నాయకులు కోఆప్షన్ నెంబర్లు వైయస్సార్ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ డోన్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహాయ సహకారాలతో డోన్ ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన 3500 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం లో తిరిగి వైఎస్ఆర్సిపి జెండాను ఎగారు వేసెలా అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి తిరిగి మళ్లీ మన వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్రంలో వచ్చేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సప్తశాల రాజేష్,ఎంపీపీ రేగాటి రాజశేఖర్ రెడ్డి,వైస్ చైర్మన్ జాకీర్ హుస్సేన్, జడ్పిటిసి రాజ్ కుమార్, కౌన్సిలర్లు మేకల విమల,ఆర్ట్స్ రమణ,నంద్యాల జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామచంద్రుడు,డోన్ పట్టణ యుత్ అధ్యక్షుడు రాజవర్ధన్,ఇతర టిడిపి కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నాయకులు కో ఆప్షన్ నెంబర్లు పాల్గొన్నారు.
3500 కోట్లతో డోన్ నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి పనులే బుగ్గనని గెలిపిస్తాయి – బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి
RELATED ARTICLES