
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ మండలం సీతాయగూడెం గ్రామానికి చెందిన పురాతన జలగం వెంగళరావు సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. **సగటు ప్రజల సాగునీటి అవసరాలను తీర్చే ఈ ప్రాజెక్టును పునర్నిర్మించేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది.
ఈ ప్రాజెక్టు అలుగు పునర్నిర్మాణానికి రూ.33 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అశ్వరావుపేట శాసనసభ్యులు శ్రీ జారే ఆదినారాయణ గారు భూమి పూజ నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఎమ్మార్వో సంధ్యారాణి, ఎంపీడీవో అశోక్ కుమార్, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఏఈ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, బొజ్జా నాయక్, నల్లమోతు వెంకటరమణ, తుమ్మలపల్లి సురేష్, సారేపల్లి శేఖర్, బొర్ర సురేష్, పజిల్ బక్షి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రాజెక్టు పునర్నిర్మాణంతో ఈ ప్రాంత రైతులకు సాగునీటి సమస్యలు తొలగే అవకాశముందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.