Monday, December 23, 2024

30న పత్తికొండకు సీఎం వైయస్ జగన్ రాక

TEJA NEWS TV :

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ఈ నెల 30న పర్యటిస్తున్న సందర్భంగా పత్తికొండలోని స్త్రీ శక్తి భవన్ నందు సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై చర్చిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్, సెబ్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, జాయింట్ కలెక్టర్ ఎన్.మౌర్య,మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు..

కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా సెయింట్ జోసెఫ్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular