Wednesday, February 5, 2025

23 రోజులు గడుస్తున్నా మృతి చెందిన పార్వతి కి న్యాయం చేయలేని అధికారులు

23 రోజులు గడుస్తున్న మృతి చెందిన పార్వతీకి  న్యాయం చేయలేని అధికారులు

పార్వతి మృతి సంబంధించి తప్పుడు ఫారెన్స్ మెడికల్ రిపోర్టులు చూపిస్తున్న మెడికల్ అధికారులు

విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ పై  చర్యలు తీసుకోలేని పోలీస్ అధికారులు

మృతి చెందిన పార్వతి కేసు పక్కదోవ పట్టిస్తున్న, అధికారుల పైన తప్పుడు రిపోర్ట్స్ అందిస్తున్న అధికారులపై ఎస్పీ, జిల్లా కలెక్టర్, గారు స్పందించాలి

అఖిలభారత విద్యార్థి  సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కోసిగి మండలం  హాస్టల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి సీనియర్ అసిస్టెంట్ తిక్కస్వామి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఈరేష్ మాట్లాడుతూ రచ్చమారి ఏపీ మోడల్ స్కూల్ 10 వ తరగతి విద్యార్థి పార్వతి మృతి చెంది 23 రోజులు గడుస్తున్న విద్యార్థి ఎలా మరణం గల కారణాలు ఇప్పటివరకు అధికారులు తెలియజేయకుండా  పోలీస్ అధికారులు తమ సీట్లకు పరిమితం అయ్యిరు అన్నారు  తల్లిదండ్రులు మా పాప మరణానికి కారణము హాస్టల్ వార్డెన్ ను  మరియు కళాశాల ప్రిన్సిపాల్ అనే కంప్లైంట్ చేస్తే ఇప్పటివరకు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని మండిపడ్డారు  అలాగే విద్యార్థి చనిపోయిన రోజునా పోస్టుమార్టం జరిపించడానికి ఆదోని ప్రభుత్వ హాస్పిటల్ కి  సాయంత్రం 5:04pm గంటల నాలుగు నిమిషాలకు ఏపీ మోడల్ స్కూల్ నుండి ఆటోలో ఆదోని ప్రభుత్వ హాస్పిటల్ పోస్టుమార్టానికి తీసుకెళ్లరు  హాస్పిటల్ వెళ్లడానికి దాదాపు గంట ముపై నిమిషాలు పడుతుందని కానీ మెడికల్ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ లో 5:15 నిమిషాలకు హాస్పిటల్లో  పోస్టుమార్టం ప్రారంభించినట్టు  తప్పుడు రిపోర్ట్స్ చూపిస్తున్నారు అలాగే విద్యార్థి పోస్టుమార్టం చేసి 6 గంటల 30 నిమిషాలకు పోస్టుమార్టం పూర్తి చేసినట్టు చూపిస్తున్నారు,తల్లిదండ్రులకు మృతదేహాన్ని 8:55 నిమిషాలకు మృతదేహాన్ని అప్పగిస్తే రిపోర్ట్స్ లో 6:30 నిమిషాలకు ఇచ్చినట్టు రిపోర్ట్ చూపిస్తున్నారని అన్నారు, ఏ కేసైనా సరే రెండు మూడు రోజుల్లో టేకప్ చేసే పోలీస్ అధికారులు 23 రోజులు గడుస్తున్న విద్యార్థి మృతికి గల కారణాలు వెలకతీయ పోవడానికి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నారు వెంటనే విద్యార్థి మృతికి గల కారణాలు వెలికి తీసేందుకు ప్రత్యేకంగా అధికారులను కేటాయించి విచారణ వేగవంతం చేసి నిజానిజాలు బయటికి తీయాలని అలాగే హాస్టల్ వార్డెన్ మరియు ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేసి కస్టడీలోకి  తీసుకొని విచారణ చేసి విద్యార్థి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు, అలాగే మృతి చెందిన విద్యార్థి కుటుంబంలో చదువుకున్న విద్యార్థికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి మరియు కుటుంబానికి ప్రభుత్వం తరఫున 30 లక్షలు ఎస్గ్రేషియా ప్రకటించి విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని  వారు కోరారు అలాగే ఇలాంటి సంఘటనలను పునవృత్తం కాకుండా అధికారులు హాస్టల్  విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారన్నారు అధికారులు విద్యార్థికి న్యాయం చేయలేనిపక్షంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు విజయ్,బడే షాబ్,అల్లప్ప, ఉసేని,కృష్ణ, మునిశ్వామి,కాశీం,అంజి, లక్ష్మి రెడ్డి, భాష,హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular