కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన చాకలిపాండు (21 సంవత్సరాలు) కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పలో ఫర్టిలైజర్ షాపులో పనిచేస్తున్నాడు. పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఆదోని నుండి సిరుగుప్ప కు వెళ్తుండగా మార్గమధ్యంలో సంతేకుడ్లూరు గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రక్తపు మడుగులో పడి ఉన్న పాండు ను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే మృతి చెందిన పాండు ను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు
విషయం తెలుసుకున్న తండ్రి చాకలి హేమాద్రి, తల్లి ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నూరుగా వినిపిస్తున్నారు
మరో 20 రోజుల్లో పెళ్లి అనగా ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని స్థానికులను సైతం ఈ ఘటన కంటతడి పెట్టించింది
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
20 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే ఘోరం
RELATED ARTICLES