ఆళ్ళగడ్డ: రిజిస్ట్రేషన్ శాఖలో 2.0 సిస్టం అమలులో లేనప్పుడు వయస్సు మల్లిన వారికి అనారోగ్యముతో ఉంటూ బయటికి రాలేని పరిస్ధితులలో ఉన్న వారికి సబ్ రిజిస్ట్రారు ఆఫీసుకు సంబంధించిన సిబ్బంది ఇంటి వద్దకి వచ్చి ప్రైవేట్ అటెండెన్స్ ద్వారా రిజిస్ట్రేషనులు చేసే సౌకర్యం ఉండినది. అయితే ప్రస్తుతం 2.0 సిస్టం లో ఇంటి వద్దకే వచ్చి ప్రైవేట్ అటెండెన్స్ ద్వారా రిజిస్ట్రేషనులు జరిగే వీలు లేనందున వయస్సు మల్లిన వారికి అనారోగ్యముతో ఇంటి వద్దనే ఉన్న వారు రిజిస్ట్రేషనులు చేయించుకొనుటకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వమునకు 2.0 సిస్టం లో ప్రైవేట్ అటెండెన్స్ ద్వార వయస్సు మల్లిన వారికి అనారోగ్యముతో ఉన్న వారికి వారి ఇంటి వద్దకే వెళ్ళి రిజిస్ట్రేషనులు జరిపించే విధానం ను పునఃప్రారంభించి అనారోగ్యముతో ఉన్న వారికి రిజిస్ట్రేషనులు జరిగే లాగున చేయాలని ప్రభుత్వమునకు రిజిస్ట్రేషను శాఖ అధికారులకు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు పరిధిలోని ప్రజలు మరియు ఆళ్ళగడ్డ సబ్.డి.కి సంబంధించిన దస్తావేజు లేఖరులు మరియు స్టాంపు వెండర్లు విన్నవించుకొనుచున్నారు. ఈ సమావేశములో ఆళ్ళగడ్డ దస్తావేజు లేఖర్లు B.లూకయ్య, పత్తి రామసుబ్బయ్య, షేక్ కరిముల్లా, M.సంజీవరాయుడు, జనార్దన్ శర్మ, D. గిరిబాబు,Mబాలఓబయ్య, K. మహమ్మద్ రఫీ, K.బాబు, G.మహబూబాష, S.J.రాజేంద్రప్రసాద్, p.హరి, Jమొహన్,K. షాబుద్ధిన్, P. మధు, Sముస్తాక్, P.C.పోలయ్య, గుబగుండం రపీ,B. అశోక్,T వెంకటసుబ్బయ్య, P.ఓబులేసు, B. రాజేష్, N. సుబ్బు, N.రామంజినేయులు, S.గఫార్, T. సంజీవరాయుడు, S.చాంద్ బాష, C.సురేష్,S. గౌస్ పీర్, మహేష్,G.పవన్,D. జయప్రసాద్, D. హుస్సేన్ భాష, D. హుసేని,స్టాంపు వెండర్లు గురుమూర్తి, మెహరాజ్,M.ఈశ్వర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు…
2.0 సిస్టములో ప్రైవేట్ అటెండెన్స్ రిజిస్ట్రేషన్ల పై ఆందోళన
RELATED ARTICLES