తేజ న్యూస్ టివి ప్రతినిధి
వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ లో పారిశుధ్య మరియు వాటర్ సప్లయ్ మొదలగు స్థానిక సమస్యలపై పర్యటించి పలు సలహాలు సూచనలు చేసిన స్థానిక *కార్పొరేటర్ సుంకరి.మనీషా శివకుమార్*
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గరీబ్ నగర్ లోని జాన్ పాక లో గల్లీలలో పారిశుధ్య నిర్వహణ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని జవాన్ కి సూచించారు.వాటర్ సప్లయ్ లో నెలకొని ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని వెంటనే పరిష్కరించడానికి వీలుగా ఉంటుంది అని అన్నారు.స్ట్రీట్ లైటింగ్ రిపేరింగ్ సిబ్బంది సమ్మె లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని త్వరలోనే వెలగని వీధి దీపాల్ని మరమ్మతు చేసి వెలిగించడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు పోగుల.సంజీవ,నాయకులు బొజ్జం.తిరుపతి,నరసింహ,రాజారాం,అంజద్,బొంత.రవికుమార్,పూర్ణ,రామకృష్ణ,రాజు,కోటేశ్వర్,మురళీ,కుమార్,సంపత్ మరియు వాటర్ లైన్ మెన్ ఉస్మాన్,జవాన్ రాజేష్,సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
16వ దివిజన్ గరీబ్ నగర్ లో సమస్యలపై పర్యటించిన కార్పొరేటర్ సుంకరి, మనిషా-శివకుమార్
RELATED ARTICLES