తేజ న్యూస్ టివి ప్రతినిధి
వరంగల్ మహానగర పాలకసంస్థ 16వ డివిజన్ పరిధిలోని జాన్ పాక లో సోల.రాజు గల్లీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ మరియు వివిధ గల్లీలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన స్థానిక *కార్పొరేటర్ సుంకరి.మనీషా శివకుమార్*
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సీసీ రోడ్లు మంచి నాణ్యతతో మరియు సకాలంలో పూర్తి చేయాలని మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ మరియు కాంట్రాక్టర్ లకు సూచించారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్క్ ఇన్స్పెక్టర్ లు వేణు,శ్రావణ్ స్థానిక బీ. ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఎండి.ఆరిఫ్,గాడ్దుల.రాజు,బోనాల.రమేష్,ఎండి .జమీల్, సోల.రాజు మున్సిపల్ జవాన్ రాజేష్,వాటర్ లైన్ మెన్లు మరియు స్థానిక బీ.ఆర్.యస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.