భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ  న్యూస్ టీవీ
చండ్రుగొండ, అక్టోబర్ 21.
చండ్రుగొండ మండల పరిధిలోని రావికంపాడు గ్రామంలో గ్రామ కమిటీ సభ్యులు, ఇంద్రమ్మ హౌసింగ్ బెనిఫిషియరీస్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారమవుతోన్న “రావికంపాడు గ్రామం నుంచి 15 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు” అనే వార్తలను వారు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజార్టీ ఇచ్చాము. మా నమ్మకాన్ని గౌరవించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  మా గ్రామానికి 82 ఇంద్రమ్మ ఇళ్ళను మంజూరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు వాస్తవంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తున్నాయి. అదే చూసి ఓర్వలేక కొందరు కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు,” అని ఆవేదన వ్యక్తం చేశారు.
“ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజల మద్దతును కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో గతాన్ని మించి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. బీఆర్ఎస్ అభ్యర్థుల డిపాజిట్లు కూడా దక్కకుండా చూస్తాం,” అని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కుక్కల ముత్యాలరావు, బానోత్ కిషన్, తేజావత్ హరి, కుక్కల వెంకటేశ్వర్లు, ఇమ్మడి రామారావు, వంశీ, రంగీశెట్టి గోపి, కుక్కల గోవిందరావు, బండారి భాస్కరరావు, ఇనుముల సైదులు, పిన్నిబోయిన కృష్ణార్జునరావు, నూతలపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
15 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరికను తీవ్రంగా ఖండించిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు
RELATED ARTICLES


 
                                    


