
TEJANEWSTV TELANGANA : చేగుంటకు చెందిన మురాడి నర్సమ్మ 1920 లో జన్మించారు.మొట్టమొదటి ఎన్నికల నుండి చివరి ఎంపీ ఎలక్షన్ వరకు అన్ని ఎన్నికలలో ఓటు వేసింది. తను 90 సంవత్సరాల వయస్సు వరకు పొలం పనులు చేసింది.మూడు నెలల ముందు వరకు కూడా తన పనులు తానే చేసుకుంది.నర్సమ్మ భర్త మురాడి సాయిలు చేగుంటకు రెండవ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికై మరణించే వరకు గ్రామానికి సేవ చేశాడు.సర్పంచ్ కాకముందు చేగుంటకు ఉపసర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికై దాదాపు 26 సంవత్సరాలు సేవచేశారు.వీరి కుమారుడు మురాడి ముత్యాలు చేగుంట PACS ఛైర్మెన్ గా పనిచేశాడు.నర్సమ్మకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు.కుమారుడు,మొదటి కుమార్తె చనిపోగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.



