10 గంటల పని దినాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 282 ముందుకు తీసుకురావడం దుర్మార్గమని సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి మండిపడ్డారు. చేగుంట మండల కేంద్రం గాంధీ చౌరస్తా వద్ద పది గంటల పని దినాన్ని, 282 జీవో రద్దు చేయాలని, సోమవారం పంచాయతీ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు.వారు మాట్లాడుతూ కార్మిక రంగంలో సంస్కరణలను అమలు పేరుతో కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్లు అమలు చేసేందు ఉవిల్లూరుతున్న సందర్భంలో ఆ లేబర్ కోడ్ లో ప్రతిపాదించిన పది గంటల పని దినాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 282 రూపంలో ముందుకు తీసుకురావడం, దుర్మార్గమని అన్నారు. జూలై 9న దేశ వ్యాపిత సన్నద్ధం అవుతున్న తరుణంలో మరింత విధంగా జీవో ఉన్నదని, ఈ చర్యలను రాష్ట్ర కార్మిక వర్గం ప్రతిఘటించాలని కార్మిక సంఘాలు పిలుపు నిచ్చయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన పని గంటల పెంపు, 282 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
10 గంటల 282 జీవోను రద్దు చేయాలని ధర్నా -సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి
RELATED ARTICLES



