TEJA NEWS TV : హోళగుంద మండల ఎస్సైగా వల్లేపు శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టారు.ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై అబ్దుల్ జహీర్ కర్నూల్ ఎస్ బి కి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాసులను మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఎస్సై శ్రీనివాసులు రంజాన్ పండుగ సందర్భంగా హోలగుంద మండలంలోని ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారు సూచించారు మరియు ఆర్థిక మోసాల పట్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు తెలియజేశారు
ఎవరైనా ఫోన్ చేసి మీబ్యాంక్ అకౌంట్ వివరాలు, మరియు ఓటీపి లాంటివి అడిగితే పోలీస్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేయాలని. సూచించారు.అదేవిధంగా ఎండ తీవ్రంగా ఉన్నందున చిన్న పిల్లలు,వృద్దులు మరియు అనవసరంగా ఎండలో తిరగకుండా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని వారు సూచించారు. హొళగుంద మండలంలోని మరియు గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వల్లెపు శ్రీనివాస్ తెలిపారు.
